బాక్సైట్ గనులపై గిరిజనులు పోరుకు స్పందన
Published on: Fri Oct 19, 2012 9:15AM
.png)

తమ ప్రాంతంలో బాక్సైట్ గనులపై పోరు సలిపేందుకు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల గిరిజనులు సిద్ధంగానే ఉన్నారు. వీరు తమ ప్రయోజనాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారని అన్ని పార్టీల నాయకులు గమనించారు. అయితే కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ వీరితో పాటు తాను చేయికలిపారు. గిరిజనుల హక్కులను కాలరాసే ఏ నిబంధనా అమలు చేయటానికి తాను అంగీకరించబోనని మంత్రి హామీ ఇస్తున్నారు. అంతే కాకుండా బాక్సైట్‌గనుల తవ్వకాలను మంత్రి స్వయంగా ఎదుర్కొంటున్నారు. తాజా కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో కిశోర్ చంద్రదేవ్ దీనిపై మాట్లాడుతూ గిరిజనుల గ్రామాల్లో సభలు జరిగాక ఆ సభలో ఆమోదం పొందినప్పుడే పారిశ్రామిక అవసరాలకు భూములు సేకరించాలన్నారు. దీనికి మంత్రి రమేష్ కూడా స్పందించి గిరిజనులకు హానికారకంగా ఉండే ఏ అంశాలు తామూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. కిశోర్ సూచనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అనుకూలమైన అంశాలపైనే దృష్టిసారిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.


