బతుకమ్మ చీరల స్కామ్
Published on: Wed Jul 31, 2024 5:01PM
బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారని.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారని రేవంత్ ఆరోపించారు.


