ఆరో రోజు బతుకమ్మ: అలిగిన బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా చెప్పుకొనే బతుకమ్మ పండుగ ఊరూవాడా ఘనంగా జరుగుతోంది. మధ్యాహ్న వేళల్లో కార్యాలయాలు, కళాశాలల్లో, సాయంత్ర సమయంలో ప్రతి ఇంటి ముంగిట నిండుగా ముస్తాబైన ఆడపడుచులు బతుకమ్మలను అడుతుండటంతో ఆయా ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. వేడుకలు ఇవాళ్టీకి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఒక్కోరోజు ఒక్కోపేరుతో బతుకమ్మను పిలుస్తూ..అందంగా పేరుస్తూ..విభిన్న పలహారాలు చేసే ఆడబిడ్డలు ఈ రోజు మాత్రం బతుకమ్మను అలంకరించరు. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వకాలంలో బతుకమ్మను పేరుస్తుండగా అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని..అందుకే ఈ రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. ఆరవరోజు బతుకమ్మను ఆడరు..అలాగే ప్రసాదం కూడా ఏమీ చేయరు.