TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో బతుకమ్మ షెడ్యూల్ విడుదల

Published on: Sat Sep 20, 2025 9:02PM

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21న హైదరాబాద్ శివార్లలో మొక్కల నాటే కార్యక్రమంతో వేడుకలకు శ్రీకారం చుడతారు. అదే రోజు సాయంత్రం హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

బతుకమ్మ సంబరాల షెడ్యూల్

22 సెప్టెంబర్: హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి వద్ద ఉత్సవాలు.

23 సెప్టెంబర్: నాగార్జునసాగర్ బుద్ధవనం.

24 సెప్టెంబర్: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్‌లో వేడుకలు.

25 సెప్టెంబర్: భద్రాచలం, ఆలంపూర్ జోగులాంబ ఆలయాల్లో బతుకమ్మ.

26 సెప్టెంబర్: నిజామాబాద్ అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సంబరాలు; హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సైకిల్ ర్యాలీ.

27 సెప్టెంబర్: ఉదయం నెక్లెస్ రోడ్డులో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నీవాల్.

28 సెప్టెంబర్: ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి, 10 వేల మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా వేడుకలు.

29 సెప్టెంబర్: పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు.

30 సెప్టెంబర్: ట్యాంక్‌బండ్‌పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపాన్ కళాకారుల ఇకెబానా ప్రదర్శన, సచివాలయంపై 3డీ మ్యాప్ లేజర్ షో.

ఇక, 25 నుండి 29 వరకు హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ కూడా నిర్వహించనున్నారు.