మనుషులు దొరకలేదా.. బ్రో!
Published on: Thu Jul 28, 2022 11:58AM
పిల్లులతో ఆడతారు, కుక్కలతో ఆడతారు.. అదో సరదా. కానీ ఈ మహానుభావుడు బాస్కెట్‌బాల్ ఆడటానకి ఎవ్వరూ దొరకనట్టు ఎద్దుతో ఆడుతున్నాడు.
ఎవరు, ఎక్కడ అన్న సంగతి పక్కనపెడితే.. ఎవరయినా బాస్కెట్‌బాల్‌ను ఆగటానికి కోర్టు, మంచి ప్లేయ ర్లు అవసరం. పోటాపోటీగా జరుగుతుంది. బాస్కెట్‌బాల్‌కు విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. మన దేశంలోనూ ఆడుతున్నారు. పల్లెల్లోకి ఇప్పుడిపప్పుడే విస్తరించింది. టీవీల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల ప్రదర్శ నల పుణ్యమా అని చాలామంది ప్లేయర్లూ తయారవుతున్నారు.
అయితే ఈ మహానుభావుడు ఎద్దుతో ఆడాలని ఆలోచించడమే చిత్రం. దానికి అర్ధమయ్యేలా ఆడటం బం తిని ఎలా తన్ని నెట్‌లో వేయాలో చెప్పడం అనేది బహు కష్ట్. అయినా అతను ఎంతలా ప్రాక్టీస్ చేయిం చాడోగాని అతనితో ఆ ఎద్దు సరదాగానే కాదు కాస్తంత సీరియస్‌గానూ రోజూ ఆడేస్తోందిట.
మనిషితో చిన్నపాటి జంతువులు ఆడటానికి సిద్ధపడతాయి, త్వరగా శిక్షణకి వీలుపడుతుంది. కానీ ఎద్దు ని ఆటకు పాట్నర్‌గా ఎలా చేసుకున్నాడన్నది పెద్ద ప్రశ్నే. అతను బంతిని గోల్ చేయడానికి ప్రయత్నిం చిన ప్రతీసారి ఎద్దు చాలా చాకచక్యంగా అడ్డుకుంటోందిట. ప్రేక్షకులు వీడియో తీసి నెటిజన్లకు కను విందు చేశారు. లక్షలమంది చూసి ఆనందించారు, కడు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. చూసిన వారు వారి సమీప ప్రాం తాల్లో ఎద్దుల్ని కూడా ఆటలోకి దింపడానికి ప్రయత్నిస్తారేమో! అసలే వీడియోల ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రయోగాలు చేయవచ్చు కాని, అదేమీ ఎద్దుతో సెల్ఫీ తీసుకోవడంకాదు. కనుక దానితో సరదా అనేది కష్టం. ముందు మనకు ఆట తెలియాలి, ఆడాలి, తర్వాత దాన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఈ చివరిదే చాలా కష్టం. ఎవరన్నా చేయగలిగితే ఓ వీరతాడు వేయవచ్చు!


