ఈ రోజు వరల్డ్ బార్బీ డే

Publish Date:Mar 8, 2016

 

ఆటబొమ్మలంటే చిన్నపిల్లలు ఎవరికైనా ఇష్టమే. అందులోనూ  బార్బీ బొమ్మలని చూడగానే దానిని కొనేంతవరకు పిల్లల మనసు కొట్టుకుపోతూనే ఉంటుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా ఇంకో స్టైల్ లో బార్బీ కనపడితే అది కూడా కోనేయాల్సిందే. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ బొమ్మలంటే ఉన్న మోజు అంతా ఇంతా కాదు. మొట్టమొదటిసారిగా ఈ బార్బీ బొమ్మని 1959లో అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ లో ప్రదర్శించారు. రూత్ హాండ్లర్ అనే యువతి రూపకల్పన చేసిన ఈ బార్బీ  బొమ్మ అసలు పేరు బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్. ముద్దుగా బార్బీ అని పిలుచుకుంటున్నాం  మనం. ప్రపంచం మొత్తం మీద ప్రతి సెకండ్ కి 3 బార్బీ బొమ్మలు అమ్మబడుతున్నాయంటే వీటికి ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది.

 

 

బార్బీ బాయ్ ఫ్రెండ్ 'కెన్' ని 1961 లో రూపొందించారు. అంతే  కాదు బార్బీ అన్నలు, అక్కలు మొత్తం కలిసి  ఏడుగురు ఉన్నారట. వాళ్ళే skipper, stacie, chelsea, krissy, kelly, tutti, todd. వీళ్ళందరితో కలిసిన బార్బీ సెట్లు కూడా మార్కెట్ లో దొరుకుతాయి. బార్బీ కి పెట్ ఆనిమాల్స్ అంటే ఎంతో ఇష్టం కదా. తన మొదటి పెట్ ఎవరో తెలుసా- హార్స్. ఈ హార్స్ మాత్రమే కాకుండా తనకి ఇంకా 21 డాగ్స్, 6 కాట్స్, ఒక చింపాంజీ, పాండా, పార్రేట్, జిరాఫ్ ఇంకా ఎన్నో పెట్ ఆనిమల్స్ ఉన్నాయట.

 

 

అందరి మనసులు దోచే ఈ బార్బీ డాల్ ఇంకా ఎన్నో కొత్త కొత్త రూపాల్లో వచ్చి పిల్లల మనసులు దోచేయ్యలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుందామా.

  ..కళ్యాణి

By
en-us Life Style News -