ఒబామా చివరి టూర్...


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూ పర్యటనలో ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఆఖరి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా.. బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన పెరూకి చెరుకున్నారు. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు. అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు.

 

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.