పదవీ కాలం అయిపోయిన తర్వాత ఒబామా ఇల్లు ఇదే..

 

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా పదవీ కాలం  వచ్చే ఏడాది జనవరి 20తో ముగియనుంది. అయితే ఇప్పుడు ఆయన అధికార నివాసం వైట్ హౌస్ అయిన పదవీ కాలం అయిపోయిన తరువాత ఆయన ఉండబోయే భవంతి అప్పుడే వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ డీసీలోని కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న భవనంలోనే ఒబామా ఉండబోతున్నారని అమెరికా మీడియా నిర్థారించింది. పావు ఎకరం స్థలంలో 1928లో ఈ భవంతిని నిర్మించారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే.