TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐసిస్ అంతమే మా లక్ష్యం.. ఒబామా

Published on: Sat Jan 30, 2016 2:39PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసిస్ అంతమే తమ లక్ష్యమని, ఐసిస్ ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా వేటాడతామని అన్నారు. ఐసిస్ పై అణచివేత చర్యలని అమెరికా కొనసాగిస్తూనే ఉంటుందని.. చర్యలను మరింతగా పెంచాలని అధికారులకు సూచించారు. అంతేకాదు ఏ దేశంలో అయితే ప్రభుత్వం బలహీనంగా ఉంటుందో అలాంటి చోట్ల ఐసిస్ కన్నేస్తోందని.. కనుక ప్రభుత్వాలకు సాయం అందిస్తూనే ఉగ్రవాదంపై పోరుకు తోడ్పడాలని భద్రతా మండలిని ఆదేశించారు.