4 రోజులపాటు మూతపడనున్న బ్యాంకులు..

 

వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రేపు అంటే 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో నాలుగు రోజులపాటు సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు మూడు రోజులు మూతపడనున్నాయి.