TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాతో ఆడండి ప్లీజ్ .. బీసీసీఐకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ

Published on: Sat Apr 4, 2026 3:32PM

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్‌‌కు మధ్య దూరం పెరిగింది. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్‌తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ 20 ప్రపంచకప్‌నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది. ఐపీఎల్‌‌లో కూడా బంగ్లా జట్టు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వైఖరి మారింది.

బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు.  మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం. అలాగే షెడ్యూల్ ప్రకారం భారత్‌కు మా జట్టు వెళ్లాల్సి ఉంది' అని అబేదిన్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది . ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 6,7 తేదీలలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సహకారంపై కూడా మాట్లాడబోతున్నట్టు సమాచారం.