TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బంగ్లాదేశ్‌లో వరుస బాంబు పేలుళ్లు..ఆరుగురి మృతి

Published on: Sun Mar 26, 2017 1:09PM

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని ఢాకా సమీపంలో ఉన్న సైహెట్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో సాధారణ ప్రజలతో పాటు ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు..సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నల్లని కవర్‌తో వచ్చిన ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని..ఆ కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు బైక్‌పై వచ్చి బాంబులు విసిరారని గాయపడ్డవారు చెబుతున్నారు. అయితే ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఢాకా ఎయిర్‌పోర్ట్‌ అని నిఘా సంస్థలు వెల్లడించాయి..ఆ ప్రయత్నం విఫలం కావడంతో సైహెట్ ప్రాంతంపై వారు దాడి చేశారని అధికారులు తెలిపారు.