బంగ్లాదేశ్ నివేదిక... టెన్షన్ లో భారత్..
Published on: Tue Mar 21, 2017 11:51AM

ఉగ్రవాదులు అప్పుడప్పుడు భారత్ లోకి చొరబడి దాడులకు పాల్పడతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఇచ్చిన నివేదిక మాత్రం కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ నివేదికలో ఏముందంటే.. తమ దేశం నుంచి పలువురు ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు బంగ్లా నిఘా సంస్థ నివేదిక సమర్పించింది. హర్కత్ ఉల్ జిహాది అల్ ఇస్లామి(హుజి), జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన దాదాపు 2,010 ఉగ్రవాదులు 2016లో బంగ్లా సరిహద్దును దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినట్లు బంగ్లా అధికారులు నివేదికలో చెప్పారు. దీంతో బంగ్లా ప్రభుత్వం ఇచ్చిన నివేదికతో పశ్చిమ బెంగాల్ తర్జనాభర్జనలు పడుతుండగా త్రిపుర, అసోం రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నివేదికపై కలవర పడుతోంది.


