బంగారు తల్లి కాదు.. మా ఇంటి మహాలక్ష్మి...

 

పేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం ఉద్దేశించిన ‘బంగారు తల్లి’ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మి’ అనే పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఆంద్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడత చెల్లింపులు జరిగాయని, ఈ పథకాన్ని ప్రశంసనీయంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు.