TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పొరపాటున కాల్ చేసినందుకు..!

Published on: Thu Mar 23, 2017 12:19PM

 

బెంగుళూరులో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పొరపాటున చేసిన కాల్ కు ఓ కామాంధుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. బెంగళూరులోని కృష్ణ రాజుపుర నగరంలో ఒక మహిళ తన బంధువులకు కాల్ చేయగా.. అది పొరపాటున వేరే నంబరుకు వెళ్లింది. ఆ నంబర్ రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన నిందితుడు రోహిత్‌ ది. దీంతో తన మొబైల్ కు పొరపాటున కాల్ వచ్చిందని ఆమె చెప్పింది. కానీ రోహిత్ మాత్రం  ఆ మహిళ గొంతుకు ఆకర్షితుడై అప్పటి నుంచి ఆమెకు మొబైల్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపించడం ప్రారంభించాడు. ఇందుకు గాను మహిళ అతనికి వార్నింగ్ ఇచ్చినా అతను మాత్రం మారలేదు. అంతేకాదు ఒకరోజు ఏకంగా ఆమె నంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకొని.. ఆమె ఇంటికి వచ్చి.. ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.