పుణె టార్గెట్ 264

Publish Date:Apr 23, 2013

 

Bangalore Pune IPL 2013, Pune Bangalore, Pune chasing target

 

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణె వారియర్స్ జట్ల మధ్య మంగళవారం సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు పుణెకు 264 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లలో గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్‌లతో 175 (నాటౌట్) విజృంభించడంతో పాటు, దిల్షాన్ 33, డివిలియర్స్ 31 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో గేల్ కొత్త రికార్డు నమోదు చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి యూసుఫ్ పఠాన్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.