TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెక్కీ నెరజాణ మాయాజాలం

Published on: Mon Nov 5, 2012 8:09AM

Bangalore Outskirts, Dead Body,  Soft Engineer, Nitish, Sowmya, Newly Married Couple, Facebook Love, Police Investigation, Poision Mixed Vodka Bottle,

బెంగళూరు శివారులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతదేహం దొరికింది. వంటి మీద గాయాలేం లేవు. పోలీసులు ఆత్మహత్యగా నమోదుచేసుకున్నారు. మృతుడి పేరు నితీష్.. వయసు 22 సంవత్సరాలు.. ఈ మధ్యే సౌమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

ఎక్కడో ఏదో కొట్టేస్తోందని పోలీసులకు అనుమానమొచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్నోడు ఆత్మహత్యెందుకు చేసుకుంటాడబ్బా అన్న అనుమానంతో తీగ లాగారు. మొత్తం విషయం బైటికొచ్చింది. ఏరికోరి ఫేస్ బుక్ లో ప్రేమాయణం నడిపించి చేసుకున్న ముద్దుల పెళ్లామే నితీష్ ప్రాణాలు చాకచక్యంగా తీసిందని తేలింది.

పెళ్లైన కొత్తలోనే ఫేస్ బుక్ లో మాయ అనే మరో అమ్మాయితో నితీష్ కి పరిచయమయ్యింది. ఆమెని పిచ్చిపిచ్చిగా ప్రేమించేశాడు. అదెవత్తో దొరికితే నన్ను పట్టించుకోవడంలేదంటూ సౌమ్య నిలదీయడం మొదలుపెట్టింది. రెండు పక్కల్నుంచీ టార్చర్.. నితీష్ కి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. ఓ రోజు.. నిన్ను కలవాలంటూ  సౌమ్య దగ్గర్నుంచి కాల్ వచ్చింది. వెతుక్కుంటూ సిటీ శివారుకెళ్లిన నితీష్ మళ్లీ తిరిగి రాలేదు.

 

 Bangalore Outskirts, Dead Body,  Soft Engineer, Nitish, Sowmya, Newly Married Couple, Facebook Love, Police Investigation, Poision Mixed Vodka Bottle,

మాయ సంగతి ఏం చేశావంటూ నిలదీసి, బీపీ పెంచిన సౌమ్య ఓ వోడ్కా బాటిల్ ని చేతికిచ్చింది. గడగడా తాగేసి పడిపోయాడు. ఎందుకంటే వోడ్కా సీసాలో ఉన్న విషం నితీష్ ప్రాణాలు తీసింది. సైకాలజీలో పీజీ చేసిన సౌమ్య మాయచేసి వోడ్కాలో సైనైడ్ కలిపి.. నితీష్ ప్రాణాలు తీసింది. కారణం.. పరాయి మగాడితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడమే..

నితీష్ తో పెళ్లయ్యాక సౌమ్యకి పాత బాయ్ ఫ్రెండ్స్ కలిశారు. పాత స్నేహాలు, శారీరక సంబంధాలు మళ్లీ చిగురించాయి. మొగుడ్ని తేలిగ్గా వదిలించుకునేందుకు ప్లాన్ చేసిన సౌమ్య మాయ అనే మాయపేరుతో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుంది. మెల్లమెల్లగా తన మత్తులోకి దింపి నితీష్ ని పిచ్చివాణ్ని చేసింది. అటు మాయగా , ఇటు సౌమ్యగా నటిస్తూ మొగుడి మెదడుని బండకేసి బాదేసి పనికిరాకుండా చేసేసింది. వన్ ఫైన్ డే విషమిచ్చి చంపేసి చక్కా పోయింది.

మొగుడికి విషమిచ్చి చంపిన క్రిమినల్ బ్రెయిన్ సౌమ్య, చాలా చిన్న పొరపాటువల్ల పోలీసులకు చిక్కింది. నితీష్ వోడ్కా తాగాక తన మూతిని టిష్యూ పేపర్ తో తుడిచి అక్కడ పారేసి పోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు టిష్యూ పేపర్ తో తాపీగా మూతి తుడుచుకోరుకదా.. అన్న అనుమానం పోలీసులకొచ్చింది. గట్టిగా ఆరా తీసేసరికి విషయం బైటపడింది.