TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్ణాటకలో ఆ ముగ్గురు మంత్రులు రాజీనామా

Published on: Wed Feb 8, 2012 8:57AM

బెంగళూరు: కర్ణాటక శాసనసభలో సెల్ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కిన ముగ్గురు బీజేపీ మంత్రులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం వారు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి సదానంద గౌడకు సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీసీ పాటిల్, కృష్ణ పాలేమార్ ఉన్నారు.