TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ తో సినిమా.. బండ్ల గణేష్ స్పందన

Published on: Wed May 29, 2019 5:48PM

 

ఏపీలో ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపుతుందనుకున్న జనసేన పార్టీ.. ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. దీంతో పవన్ రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నారని, త్వరలో ఆయన ముఖానికి మేకప్ వేసుకొని మళ్ళీ సినిమాల్లో నటించనున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు.. బండ్ల గణేష్‌ నిర్మించబోతున్న సినిమాలో పవన్‌ నటించబోతున్నారని, దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా దీనిపై బండ్ల గణేష్‌ స్పష్టత ఇచ్చారు. ‘నా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఖరారు కాలేదు. నా నుంచి ఏదైనా సినిమా వస్తే అందరి కన్నా ముందుగా నేను చెబుతా’ అని ట్వీట్‌ చేశారు.