TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్.!

Published on: Sat Dec 5, 2020 2:25PM

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువురు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది.

 

కాగా, 150 స్థానాలున్న గ్రేటర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ కి 55 స్థానాలు వస్తే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, 44 సీట్లతో ఎంఐఎం మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశముందని తెలుస్తోంది.