డాక్టర్లు ఉద్యోగాన్ని వొదులుకునే దుస్థితి!

తెలంగాణ ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందించక పోవడంతో ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు ఉద్యోగాన్ని వొదులుకునే దుస్థితికి రావడం దురదృష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మరితో యుద్ధం చేస్తుంది. ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సేవలు అజరామరం.. దేశం మొత్తం డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారిపై దయ, కరుణ చూపకుండా వ్యవహరిస్తోందని ఆయ‌న ఆరోపించారు. 

అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఉండటం చాలా విచారకరం అన్నారు. ఇలా డాక్టర్లకు కిట్స్ అందించకుండా తత్సరం చేస్తే ప్రభుత్వానికి అప్రత్తిష్ఠ పాలు అవుతుంది అని బండి సంజయ్ అన్నారు. 

ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అంధించి వారికి మనో ధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణిలో అలసత్వం వహించడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాధికాన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలాషన్ తో పాటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 

కొందరు అధికారులు WHO పేరుతో కిట్స్ అందరికి అందించడం సాధ్యం కదానడం విడ్డురం అన్నారు. నిబంధనల పేరుతో వైద్యులకు కనీస సౌకర్యాలు అంధించకపోవడం దురదృష్టకరం అన్నారు. డాక్టర్లకు సరైన సౌకర్యాలు వెంటనే అందించాలని కోరారు.  రాష్ట్రంలో సేవలు అందిస్తున్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మానందరిపై ఉన్నదని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.