PM-CARES సహాయ నిధికి విరాళ‌మివ్వండి! 

కరోనా మహమ్మరిని తరిమేద్దాం... దేశాన్ని గెలిపిద్దాం అనే నినాదం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి. బండి సంజయ్ కోరారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేపట్టి ప్రపంచ దేశాలకు ఒక దిక్సుచిగా నిలిచాం అన్నారు.  దేశంలోని 130 కోట్ల భారతీయులను కాపాడటానికి నరేంద్ర మోదీ తీసుకున్న సహోసోపేత నిర్ణయం శ్రీరామ రక్ష అన్నారు. 

లాక్ డౌన్ వల్ల దేశంలో ఏర్పడే ఆర్థిక సంక్షోభం తట్టుకోవడానికి 1 లక్ష 70 వేళా కోట్ల ప్రత్యేక బడ్జెట్ పెట్టి దేశాన్ని ఆదుకోవడం కోసం బలమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యకు తెలంగాణ ప్రజానీకం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో నెలకొన్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన PM-CARES సహాయ నిధికి తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్త సహాయం చెయ్యాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రేపు శుక్రవారం ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త 100 రూపాయలకు తగ్గకుండా విరాళం ఇచ్చి ప్రతి కార్యకర్త మరో పదిమందితో  సహాయ నిధికి విరాళం ఇప్పివ్వాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 11 గం.. నుండి మధ్యాహ్నం 1 గం..ల మధ్య PM-CARES నిధికి విరాళమిచ్చి , స్క్రిన్ షార్ట్ తీసి #TSDonates2PMCARESతో సోషల్ మీడియాలో షేర్ చెయ్యాలి కోరారు. 

PM-CARES సహాయ నిధికి తన ఎంపీ ల్యాండ్స్ నుండి 1 కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళం ఇస్తున్న‌ట్లు కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్ర‌క‌టించారు.