TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విచ్చిన్నకారులకు తగిన గుణపాఠం.. మా ఫలితంపై బండి సంజయ్ సంచలనం

Published on: Mon Oct 11, 2021 11:51AM

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నిక‌ల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని ఆయ‌న ట్వీట్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపున‌కు మద్దతు పలికిన వారికి సరైన గుణపాఠం చెప్పారన్నారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయ‌న కామెంట్ చేశారు.  

మా విజేతలకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజ‌య్‌ శుభాకాంక్షలు తెలిపారు. మా ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎదురుచూశారని బండి సంజయ్ ట్వీట్ చేశారు.