TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్ : బండి సంజయ్

Published on: Sun Jul 27, 2025 2:13PM

 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే  టికెట్ ఇప్పించింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదట  సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కేటీఆర్ వెళ్లి సీఎం రమేశ్‌కు చెప్తే ఆయన కేసీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించారు. తర్వాత సీఎం రమేశ్ ఆర్ధిక సాయం చేసి కేటీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించారు అని తెలిపారు. 

కేటీఆర్‌పై సీఎం రమేశ్‌ చేసిన ఆరోపణలు వాస్తవమే అని బండి సంజయ్‌ అన్నారు. సీఎం రమేశ్‌ సవాల్‌కు కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌తో చర్చకు సీఎం రమేశ్‌ను నేను తీసుకొస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్‌ చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ  అవినీతి పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాం. ఆ పార్టీని భారతీయ జనాత పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు. 

ప్రధాని మోదీ నిజామాబాద్‌ సభలో ఇదే చెప్పారు’’ అని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.