TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదల..!

Published on: Fri Jul 10, 2026 4:55PM

 

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు. హైకోర్టు నిర్దేశించిన షరతుల మేరకు లక్ష రూపాయల సొంత పూచీకత్తుపై బెయిల్ లభించడంతో జైలు అధికారులు విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. భగీరథ తరఫు న్యాయవాది హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల ప్రతిని చర్లపల్లి కేంద్ర కారాగారం అధికారులకు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం అవసరమైన అన్ని అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి, శుక్రవారం మధ్యాహ్నం బండి భగీరథ్‌ను జైలు నుంచి విడుదల చేశారు.

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ సుమారు 45 రోజులుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం బెయిల్ ఉత్తర్వులు జైలుకు చేరడంతో విడుదల ప్రక్రియ పూర్తయింది. భగీరథ్ విడుదల నేపథ్యంలో జైలు వద్ద ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు వేచి ఉండగా, విడుదల అనంతరం ఆయన వారిని కలుసుకున్నారు. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను పాటిస్తూ తదుపరి విచారణలకు హాజరుకావాల్సి ఉంటుంది.

Bandi Bhagirath released from Cherlapalli jail, High Court Bail, POCSO case, Bandi Sanjay Kumar, CM Revanth reddy, Telangana police, CP Sajjanar, DGP C.V. Anand