TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండి భగీరధ్ పోక్సో కేసుపై డీసీపీకి కమిషనర్ కీలక ఆదేశాలు

Published on: Mon May 11, 2026 6:11PM

 

సైబరాబాద్‌లో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించింది. పేట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తును నిష్పక్షపా తంగా, వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు  కూకట్‌పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ రీతిరాజ్ ను వ్యక్తిగతంగా దర్యాప్తు పర్యవేక్షణకు నియమించారు. ఈ ఘటనలో బండి భగీరథ్ పై సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 12 కింద కేసు నమోదు చేయడం జరిగింది.

పేట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేదా నిర్లక్ష్యం లేకుండా అన్ని కోణాల్లో విచారణ జరపాలని కమిషనర్ స్పష్టం చేశారు. దర్యాప్తు సరైన, వృత్తిపరమైన విధానంలో కొనసాగుతున్నదా... లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించాలని డీసీపీకి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా దర్యాప్తు పురోగతిపై ప్రతిరోజూ డైలీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించాలని కూడా కమిషనర్ పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన తెలిపారు.ఈ విషయం బండి సంజయ్ కుటుంబంలో జరిగిందని ఆయన తెలిపారు. బీజేపీ అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలని అన్నారు.