TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జెంటిల్‌మెన్‌ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపం : చంద్రబాబు

Published on: Sun Jun 8, 2025 1:57PM

 

హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,  దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు , విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే బండారు దత్తాత్రేయ అని గుర్తొస్తారని ఆయన అన్నారు. 

జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం  దత్తాత్రేయ అని  అన్నారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆయనది పేరుకు హిందుత్వం, మతం భారతీయం అని చంద్రబాబు పేర్కొన్నారు‘ అలయ్‌ బలయ్‌’ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలిపేందుకు వేదిక రూపొందించారు. ఆయనకు శత్రువులు ఎవరూ ఉండరు. ఆయనకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు. 

దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ ఎన్వీ రమణ, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.