TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అగ్నిగుండంగా మారిన బలూచిస్థాన్.. రాత్రి పూట కర్ఫ్యూ.!

Published on: Mon Aug 10, 2026 9:19AM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ మరోసారి అగ్నిగుండంగా మారింది.   శాంతిభద్రతల పరిస్థితులు దయనీయంగా మారాయి.  ప్రజలు దాదాపుగా తిరుగుబాటు చేస్తుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం సెంట్రల్ బలూచిస్థాన్‌లోని   కీలక ప్రాంతాలపై  ఆంక్షలను విధించారు.  సురబ్ జిల్లాలో  రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.  ఈ ఆంక్షలు కేవలం సాధారణ భద్రతా ప్రక్రియ మాత్రమే కాదంటూ..  బలోచ్ హక్కుల సంఘాలు  ఆరోపిస్తున్నాయి. బలోచిస్థాన్ లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి.  ఈ ప్రాంతంలో  పౌరుల అపహరణలు, హత్యల జరుగుతున్నాయని అంటున్నాయి. 

ఇక కర్ఫ్యూ విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో రాత్రి పూట కర్ఫ్యూ  ఆదివారం (ఆగస్టు 9) నుంచే అమలులోకి వచ్చింది. ఈ ఆంక్షలు ఈ నెల 15 వరకూ అమలులో ఉంటాయి.  సురబ్ జిల్లాతో పాటు పొరుగునే ఉన్న ఖుజ్దార్ జిల్లాలోనూ పరిస్థితులు  దారుణంగా ఉన్నాయి. అక్కడ కూడా  అక్కడ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు  రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ  జిల్లా యంత్రాంగా దాదాపుగా కర్ఫ్యూతో సమానమైన ఆంక్షలు విధించింది.  అక్రమ అరెస్టులు,   అపహరణలతో బలోచ్ అట్టుడికిపోతోంది. అక్రమ అరెస్టలు, అపహరణలూ, పట్టపగలే సాయుధ దుండగులు పాల్పడుతున్న హత్యాకాండకు వ్యతిరేకంగా బలోచ్ ప్రజలు గట్టిగా గళం విప్పుతున్నారు. ఆ ప్రజా గళాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధిస్తూ, నిర్బంధాన్ని అమలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వరుస ఘటనలతో బలూచిస్థాన్‌లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇది కేవలం శాంతిభద్రతల పరిరక్షణ చర్య కాదని, పౌరుల గొంతు నొక్కడానికి, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా అమలు చేస్తున్న నిర్బంధమని బలూచిస్థాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Balochistan Tensions, Surab District Curfew, Khuzdar Restrictions, Pakistan Security Situation, Baloch Human Rights, Saeed Ahmed Disappearance