TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైవీ జైలుకెడితే ఫస్ట్ ఆనందించేది నేనే.. బాలినేని సెన్సేషనల్ కామెంట్స్

Published on: Fri Feb 27, 2026 5:08PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువులు అయిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డిల మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి జైలుకెడితే సంతోషించే వారిలో మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు.

 ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల తరువాత తాను జనసేనలో చేరానన్నారు.  జనసేనలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేయడంతో సీఎం చంద్రబాబును విచారణ జరిపించాలని కోరానన్నారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలన్నారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.