జనసేనలో బాలినేని చిచ్చు!
Published on: Wed Sep 25, 2024 12:15PM

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరే అంశం పెద్ద వివాదంగా మారింది. తాజాగా ఒంగోలులో ఆయన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. బాలినేని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో గురువారం (సెప్టెంబర్ 26) చేరనున్నారు. ఆ సందర్భంగా నగరంలో పలుచోట్ల బాలినేని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ సంఘటనపై బాలినేని అభిమానులే కాక జనసేన శ్రేణులు కూడా మండి పడుతున్నాయి. ఒంగోలు నగరంలో చర్చనీయాంశంలా మారింది ఫ్లెక్సీల వ్యవహారం. ఈ వ్యవహారం కూటమి పార్టీలలో విభేదాలకు కారణమౌతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


