బాలయ్య ఎంట్రీ అదుర్స్..!

posted on: Jul 16, 2013 12:09PM

 

balayya boyapati, balakrishna new movie, boyapati new movie

 

 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. బోయపాటి శ్రీను బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ ను పవర్ ఫుల్ గా ప్లాన్ చేశాడట. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు."సింహ" తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి కొర్రపాటి, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుకంర నిర్మాతలు.

google-ad-img
    Related Sigment News
    • Loading...