ఊతకర్ర సహాయంతో బాలకృష్ణ....
Published on: Tue Aug 19, 2014 9:45AM

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో బైక్ మీద నుంచి జారి పడి గాయపడిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు బాలకృష్ణ ఊతకర్ర సాయంతో వచ్చారు. బాలకృష్ణని టీడీపీ, వైసీపీలకు చెందిన శాసనసభ్యులు ఆయనను పరామర్శించారు. ఆయనకు గాయం ఎలా అయ్యిందో... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అడిగిన వారందరికీ సమాధానం చెబుతూ బాలకృష్ణ చాలా ఉత్సాహంగా కనిపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బాలకృష్ణ, నటి రోజాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ బయటకు రావడం విశేషం. రోజా టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బాలకృష్ణ, రోజా ఇలా ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది.


