TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీగా పోటీ చేయనున్న బాలయ్య అల్లుడు?

Published on: Tue Jul 3, 2018 5:25PM

 

టీడీపీ ఈమధ్య '25 ఎంపీ స్థానాలు గెలిపించండి, కేంద్రం మనం చెప్పినట్టు వింటుంది.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా సాధిస్తాం' అని చెప్పడం వింటున్నాం.. దానికి తగ్గట్టే టీడీపీ 25 స్థానాల్లో బలమైన నేతలని రంగంలోకి దింపాలని చూస్తుందట.. ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో ఎంపీ సీట్ల అభ్యర్థుల గురించి అప్పుడే చర్చ మొదలైంది.. గత ఎన్నికల్లో అంటే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది.. దాంతో టీడీపీ కొన్ని సీట్లు సర్దుకోవాల్సి వచ్చింది.. కానిప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. టీడీపీ ఒంటరిగా పోరుకి సిద్ధమైంది.. 25 స్థానాల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటుంది.. మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థులు అంటూ కొన్ని పేరులు తెరమీదకు వస్తున్నాయి.. వాటిల్లో ప్రధానంగా బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ పేరు వినిపిస్తుంది.. శ్రీ భరత్ వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందట.. ఈ స్థానం నుండి కొందరు సీనియర్ నేతలు పోటీచేయాలని ఆశ పడుతున్నప్పటికీ.. శ్రీ భరత్, బాలకృష్ణ అల్లుడు కావడంతో చంద్రబాబు శ్రీ భరత్ వైపే ఎక్కువ మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చు అంటున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.