గుర్రం ఎక్కిన బాలయ్య.. అక్క ఇంట్లో అఖండ సంక్రాంతి..
Published on: Sat Jan 15, 2022 1:39PM
బాలయ్య ఏం చేసినా సంథింగ్ స్పెషల్. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. ఆఖరికి సంక్రాంతి సంబరాలైనా.. బాలయ్య తోపు. అఖండతో అఖండ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.
పండగకి అక్క-బావల ఇంటికి వెళ్లారు బాలయ్య దంపతులు. ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి-వెంకటేశ్వరరావుల ఇంట్లో వేడుకగా సంక్రాంతి జరుపుకుంటున్నారు.
తెలుసుగా.. బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడేగా. హైపర్ యాక్టివ్గా ఉండే బాలకృష్ణ అన్స్టాపబుల్ జోష్లో ఉంటారు. కారంచేడులో హల్చల్ చేస్తున్నారు. గుర్రం ఎక్కి హంగామా చేశారు. గుర్రపు స్వారీతో అభిమానులను అలరించారు. సంక్రాంతి సందడంతా బాలయ్య దగ్గరే కనిపిస్తోంది.
బాలకృష్ణను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున కారంచేడుకు తరలివచ్చారు. తెలుగు వారందరికీ బాలకృష్ణ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.


