పోటీపై డిసైడ్ అవ్వలేదు: బాలయ్య
Published on: Thu Apr 10, 2014 11:54AM
.jpg)
నందమూరి నటసింహం బాలకృష్ణ 'లెజెండ్' సినిమా విజయవంతమైన సందర్బంగా ఈ రోజు కరీంనగర్ ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీ చేసే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. పార్టీ తరపున తెలంగాణాలో కూడా ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే గతంలో తన తండ్రి నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం స్థానం నుంచే తాను పోటీ చేయాలని భావిస్తున్నట్లు బాలకృష్ణ తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


