బాబాయి, అబ్బాయి మధ్య అల్లుడి మంట

 

balakrishna ntr, pawan kalyan ram charan, venkatesh rana

 

 

బాబాయి, అబ్బాయి..గత రెండు రోజులుగా అందరి నోట్లో నానుతున్న పేర్లవి. ఎక్కడ ఏ నలుగురు ఒక చోట చేరినా ఏంటి కథా? అంటుంటే సోషల్ నెట్ వర్క్స్ లోనైతే..ఎవరి వాల్ మీద చూసినా...ఈ విషయం మీద కామెంట్లు, లైకులు, షేర్ లు..ఎవరికి చేతనైన౦త సెటైర్లు వాళ్ళు చేరుస్తూ డైలాగులు రాసేస్తున్నారీ బాబాయి..అబ్బాయి సినిమాకి...ఇక న్యూస్ న్యూస్ ఛానెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది....గంట గంటకి చర్చలు, ప్రత్యేక కథనాలు..ఇంత హడావుడికి కారణమైన ఈ బాబాయ్..అబ్బాయ్ సినిమాలో వాళ్ళ సినిమాల్లో లానే ఓ ఆసక్తికర ట్విస్ట్..అదే ఫ్లాష్ బ్యాక్ ఉందని బోగట్టా..వివరంగా చెప్పాలంటే..

 

అబ్బాయి మామగారు, బాబాయి గారి అల్లుడు కలిసి ఓ వ్యాపారం మొదలుపెట్టారట. అందులో బాబాయి గారి అల్లుడు 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే అబ్బాయి మామగారు దానికి లెక్క చూపించకుండా...లాభం, గీభం జాన్తా నహీ..సొమ్ము కాస్త ఖర్చు అనే సారికి బాబాయి గారి అల్లుడుకి సుర్రు సుమ్మైంది.

 

అనుకున్నది ఒకటి..అయ్యింది ఒకటి దీంతో ఎం చెయ్యాలో తోచని సదరు అల్లుడు.. మామగారితో తన గోడు మొర పెట్టుకుంటే..ఆయన అబ్బాయి గారి మామగారిని తనదైన శైలిలో నోటికి వచ్చినదంతా అందుకున్నారు. ఇది మామగారు తన అల్లుడి దగ్గరా మొర పెట్టుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల బోగట్టా.



అక్కడ మొదలైన పొగ, సెగలాగ బంధాలను, అనుబంధాలను కమ్మేసి మసక బార్చేసింది. ఇదంట అసలు కథ అని సినీ వర్గాలు చెవులు కోరుక్కుంటే.. బాబాయ్..అబ్బాయ్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని అభిమానులు బోరుమంటున్నారు..ఈ చిచ్చు ఇప్పుడప్పుడే అరదు కదా అని.