TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాల‌కృష్ణ మౌన‌దీక్ష‌.. జ‌గ‌న‌న్న‌కు ద‌బిడి దిబిడే..

Published on: Fri Feb 4, 2022 11:24AM

బాల‌కృష్ణ మాట‌లు బాంబులు పేలిన‌ట్టుంటాయ్‌. బాల‌య్య‌ డైలాగ్ చెబితే.. ఉరుములు ఉరిమిన‌ట్టు ఉంటాయ్‌. తొడ‌కొడితే.. మెరుపులు మెరుస్తాయ్‌. అలాంటి బాల‌కృష్ణ‌.. స‌డెన్‌గా మౌన‌దీక్ష‌కు దిగితే..? ఆ సైలెన్స్ ఎంత వైలెన్స్‌గా ఉంటుందో జ‌గ‌న‌న్న‌కు తెలిసిరాక త‌ప్ప‌దంటున్నారు హిందూపురం ప్ర‌జ‌లు. ఇంత‌కీ, బాల‌య్య మౌన‌దీక్ష ఏంటంటే.. అస‌లేం జ‌రిగిందంటే...

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. మొద‌ట‌ పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ జంక్ష‌న్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాల‌య్య వెంట‌ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్షకు కూర్చున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

సాయంత్రం వ‌ర‌కూ బాల‌కృష్ణ దీక్ష కొన‌సాగ‌నుంది. అనంత‌రం, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో.. చేపట్టాల్సిన భ‌విష్య‌త్‌ ఉద్యమ కార్యాచరణపై ఆఖిల ప‌క్ష స‌మావేశంలో స్థానిక‌ నేతల‌తో చ‌ర్చించ‌నున్నారు ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌. ఇలా బాల‌య్యే స్వ‌యంగా బ‌రిలో దిగ‌డంతో.. హిందూపురంలో ద‌బిడి దిబిడే..అంటున్నారు.