TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలయ్య మాస్టారు మాంచి లెక్చర్ ఇచ్చారు!

Published on: Thu Aug 18, 2022 5:26PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాస్టారుగా మారి మాంచి లెక్చర్ ఇచ్చారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య గురువారం లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొట్నూరు ఉన్నత పాఠశాలఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసంస్థలకు ఎల్ఈడీ టీవీలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్టారు బాలకృష్ణ విద్యార్థులకు మాంచి లెక్చర్ ఇచ్చారు.సామాజిక మాధ్యమంలో ఎక్కువ సేపు కాలం వృధా చేయొద్దన్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టండి, ఫేస్బుక్ చూస్తూ కాలం వృధా చేయవద్దంటూ హితవు చెప్పారు. అంతకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో హిందూపురంలో వైసీపీ ఎంపీ మాధవ్ జెండా ఆవిష్కరణ  చేయడాన్ని తప్పుపట్టారు.

అశ్లీల వీడియోలో అడ్డంగా దొరికి పోయిన మాధవ్ కు జాతీయ జెండా ఆవిష్కరించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.తెలుగుదేశం కార్యకర్తలు ఆయనని అడ్డుకుంటే పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు.  ఇలాంటి అరెస్టులకు తెలుగుదేశం కార్యకర్తలు భయపడదన్నారు.

 వైసీపీ .సంక్షేమం ప్రచారం లో మాత్రమే ఉందని అమలులో లేదని  అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయం లో గుణపాఠం చెబుతారని బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం  పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ఆయన  బుధవారం ప్రారంభించారు.