బీచ్‌లో భార్యతో బాలయ్య షికార్లు.. అఖండ ఎంజాయ్‌మెంట్ అదుర్స్..
Published on: Sun Jan 16, 2022 11:58AM
బాలయ్య జోష్ అన్‌స్టాపబుల్. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ బాలయ్య ఎనర్జీ, ఎంజాయ్‌మెంట్ అన్‌స్టాపబుల్. మామూలుగానే అఖండ జోరు మామూలుగా ఉండదు. అలాంటిది తనకిష్టమైన సంక్రాంతి పండగంటే.. ఇక శాతకర్ణి ఆగుతారా.. అందుకే అక్కింట్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కారంచేడులో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
శనివారం సంక్రాంతినాడు బాలయ్య బాబు గుర్రం ఎక్కి పండగ చేసుకుంటే.. ఆదివారం చీరాలలోని వాడరేవు బీచ్‌లో ఫ్యామిలీతో కలిసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. గుర్రమెక్కినా.. భార్య వసుందర పక్కనే ఉన్నారు.. బీచ్‌లోనూ భార్యతోనే రిలాక్స్ అవుతున్నారు. బాలయ్య స్వయంగా జీప్ నడుపుతూ.. పక్క చీట్లో వసుందరను కూర్చోబెట్టుకొని.. ఇసుకలో జీప్ రైడింగ్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భార్యతో కలిసి బాలయ్య గేర్ మారుస్తూ.. జీప్ రేజ్ చేస్తుంటే.. బీచ్‌లో ఇసుక తుఫానే. బీచ్‌లో బాలయ్య దంపతుల ఎంజాయ్‌మెంట్ అన్‌స్టాపబుల్. ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ అంతా బాలకృష్ణ మీదుగానే వెళ్తోంది.
.webp)


