గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్న బాలయ్య
Published on: Tue Dec 25, 2012 5:03PM

గుజరాత్ పర్యటనను తెలుగు సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విరమించుకున్నారు. గుజరాత్ సీఎంగా బుధవారం ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నరేంద్ర మోడీ బాలయ్యను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి వెళ్లినట్లయితే టీడీపీలో విభేదాలు రావచ్చుననే ఆలోచనలతో బాలకృష్ణ గుజరాత్ పర్యటనను విరమించుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్తే పార్టీకి ఉన్న లౌకికవాద ముద్రకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే భయాలను పార్టీ నాయకుల నుంచి వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రతిస్పందించారు. చంద్రబాబు వైఖరి తెలియడంతో బాలయ్య తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.


