దుష్టశిక్షణ..శిష్టరక్షణ.. బాలయ్య కామెంట్
Published on: Sat Sep 5, 2015 11:52AM
.jpg)
ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తన ఆధ్యాత్మిక ధోరణిలో సందేశం ఇవ్వడం గమనార్హం. బాలకృష్ణకు పురాణ కథల గురించి చెప్పమంటే గుక్కతిప్పుకోకుండా చెప్పగలరని మనందరికి తెలిసిన విషయమే. అయితే అదే తరహాలో ఆయన పాపం పెరిగితే దుష్టశిక్షణ తప్పదని.. పాపం ఎక్కువైతే భగవంతుడే వివిధ రూపాల్లో దుష్టశిక్షణ..శిష్టరక్షణ చేస్తుంటారని తనదైన శైలిలో చెప్పారు. సమాజంలో హింస పెరిగినప్పుడు పాపాలు ప్రబలినప్పుడు భగవంతుడు ఇలా చేస్తాడని పురాణాలు చెప్పాయని బాలయ్య అన్నారు. హిందూ దేశమైన భారతదేశంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని బాలయ్య కోరారు.
కాగా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలకృష్ణ ఆ నియోజకర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. దానికి పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో హిందూపురం జిల్లాల్లోనే నెంబర్ వన్ ర్యాంకును సాధించడమే నిదర్శనం. అక్కడ కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.


