TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధినాయకుడు విడుదలపై అభ్యంతరాల వరద!

Published on: Thu May 31, 2012 10:30AM

Balakrishna adhinayakudu, adhinayakudu release, adhinayakudu movie release, adhinayakudu release date బాలయ్య హీరోగా నిర్మించిన అధినాయకుడు చిత్రం తమకు అభ్యంతరంగా ఉందన్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఈ చిత్రంలోని డైలాగ్ లపై తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేసి ఉప ఎన్నికల తరువాత రిలీజ్ చేసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని సమైక్యాంధ్ర జెఎసి కూడా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అలానే ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్థులు కూడా ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని దీనిలో ఇతర పార్టీలను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో విగ్రహాల రాజేకీయమేమిటని బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ట్రయల్ లోనే వణికించిందని వారి ఫిర్యాదు ద్వారా తేటతెల్లమవుతోంది. ఏమైనా ఎన్నికల సమయంలో విడుదలయ్యే సినిమాలో ఇతర పార్టీల తప్పులు కాక ఒప్పులు చూపుతారా అని సినీపందితులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిన్స్తున్నారు.