నంది అవార్డులపై బాలయ్య తొలి స్పందన...

 

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ప్రస్తుతం రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు దీనిపై స్పందించి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే బాలయ్య నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడం వల్ల ఈ రచ్చ మొదలైంది. గత మూడు రోజులుగా దీనిపై దుమారం రేగుతుండగా.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బాలయ్య ఇప్పుడు ఈ అవార్డులపై స్పందించి... తాను నటించిన ‘లెజెండ్‌’ సినిమాకు 9 నంది అవార్డులు రావడం చాలా గర్వంగా ఉందని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. లెజెండ్‌ సినిమా మాటలతో కాకుండా చేతలతో చూపించిందని సంతోషం వ్యక్తం చేశారు. అందరి సమష్టి కృషి వల్లే ఈ సినిమాకు అవార్డులు వచ్చాయన్న బాలకృష్ణ... ప్రతి విభాగానికి అవార్డులు దక్కడం ఆనందంగా ఉందన్నారు. తోటి కళాకారులకు కూడా అవార్డులు వచ్చాయన్న బాలకృష్ణ మిగిలిన సినిమాలకు అవార్డులు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. కొన్ని సినిమాలకు అవార్డు రాలేదన్న ప్రశ్నకు ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.