TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల్లో బాలకృష్ణ పోటీపై తేల్చిన బాబు

Published on: Wed Jan 25, 2012 8:53AM

ఏలూరు: హీరో నందమూరి బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయరని,ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలో ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఆయన ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బాలయ్య పోటీ చేయరన్నారు. 2014 ఎన్నికలే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు.  ప్రస్తుతం బాలయ్య సినిమాల్లో నటిస్తున్నారని త్వరలో ఆయన భవిష్యత్తు పార్టీలో నిర్ణయిస్తామన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిలు వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రులు అన్నారు. రాజకీయంగా మాత్రం వారితో విభేదిస్తానన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు స్థలం కేటాయించింది తానేనన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అది సరికాదన్నారు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీయేనన్నారు.పోలవరం పనులు నాసిరకంగా తయారవుతున్నాయని ఆరోపించారు. దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్రంలో వామపక్షాలతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతానికి మహాకూటమి ఆలోచన లేదన్నారు.