TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందుకే బాలకృష్ణ శాసనసభ్యుడిగా పోటీ

Published on: Wed Jan 18, 2012 1:29PM

హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ పార్లమెంటు సభ్యుడు బుధవారం అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడటం ఖాయమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకునే బాలకృష్ణ శాసనసభ్యుడిగా పోటీ చేస్తానని చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యేగా ఆయన గెలిస్తే సీమాంధ్ర ప్రాంతానికి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందన్నారు. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన బాలకృష్ణ, బుధవారం ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెవెన్యూ సదస్సులో జై తెలంగాణ అన్న వారిపై కేసులు పెట్టారని, అది సరికాదని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు.