TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలికి బెయిల్ ఇవ్వద్దు: సిబిఐ

Published on: Fri Dec 30, 2011 2:09PM

హైదరాబాద్: తన తల్లి వర్ధంతికి హాజరు కావడానికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించింది.గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. గాలి జనార్దన్ రెడ్డి వాదనలను సిబిఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. బళ్లారిలో ఇప్పటికే భారీగా గాలి జనార్దన్ రెడ్డి కటౌట్లకు ఏర్పాట్లు చేశారని, వందలాది వాహనాలు సిద్ధం చేస్తున్నారని సిబిఐ వాదించింది. బిజెపి నుంచి బయటకు వచ్చి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, మాజీ మంత్రి శ్రీరాములు బళ్లారి రూరల్ శాసనసభా నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తల్లి వర్ధంతి కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు.