TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళకు వెళ్లనున్న బాహుబలి

Published on: Thu Nov 7, 2013 9:45AM

 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తరువాతి షెడ్యుల్ కేరళలో జరుపుకోనున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా, తాజాగా ఈరోజు అనుష్క పుట్టినరోజు సంధర్భంగా అనుష్క ఫస్ట్ లుక్ మేకింగ్ వీడియోను విడుదల చేశాడు దర్శకుడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్ని సంగీతం అందిస్తున్నాడు.