కామిక్ లో బాహుబలి
posted on: Feb 8, 2014 8:40AM

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం "బాహుబలి". రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరొక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రఖ్యాత "కామిక్ కాన్" సమ్మేళనంలో ఈ సినిమా కూడా పాల్గొంటోంది. సినిమా ప్రేమికులు, కామిక్ ఆర్టిస్టులు, ప్రచురణ సంస్థలు, బొమ్మల తయారీ సంస్థల ప్రతినిధులు భాగస్వాములుగా ఉండే కార్యక్రమమిది. ప్రచురణ సంస్థలకు, డిజిటల్ మీడియా ప్రతినిధులకు వారధిగా పనిచేసే కార్యక్రమమిది. ఆదివారం వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో "బాహుబలి" మోషన్ పోస్టర్ ని ప్రదర్శిస్తారు.






