TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాహుబలి పని డిశంబరుకి ఫినిష్..

Published on: Sat Oct 4, 2014 8:41PM

 

దర్శకుడు రాజమౌళి దాదాపు ఏడాదిన్నరగా బాహుబలి సినిమాను తీస్తూనే ఉన్నాడు. ఆయన కోసం హీరో ప్రభాస్ కూడా వేరే సినిమాలు చేయడం మానేసాడు. షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే దీనికి దాదాపు రెండేళ్ళు పడుతుందని రాజమౌళి చెప్పేయడం వలన అందులో నటిస్తున్న వారు, ఆ సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరూ కూడా పూర్తిగా దానికే కమిటయిపోయి ఓపిగ్గా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. పాపం అందుకేనేమో అందరికీ గెడ్డలు మీసాలు ఓ తెగ పెరిగిపోయాయి.

 

తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ (ఈ) డిశంబరు నాటికి ఎలాగయినా పూర్తిచేసేయాలని రాజమౌళి కూడా కమిటయిపోయాడుట. ఈలోగా ఇంతవరకు పూర్తయిన పోర్షనుకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేసేసి, వచ్చే సంక్రాంతి బరిలోకి వదలాలని ఐడియా అట! మరి రెండేళ్ళ ఈ పాత ఐడియా ఎవరి జీవితాలను ఏవిధంగా మార్చేయబోతోందో ఎవరికీ తెలుసు?