Latest News
‘బాహుబలి’ ప్రభాస్ భుజానికి అసలేమైంది? చిన్న గాయమేనా?
posted on: May 19, 2014 2:36PM
.jpg)
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ సెట్స్ మీద వుంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు, ఎదురుచూపులు వున్నాయి. ‘బాహుబలి’ అనేది ఒక పేరు కావొచ్చు.. నిజానికి ఆ మాటకు అర్థం బలమైన చేతులున్నవాడు అని. సినిమాలో ప్రభాస్‌కి బలమైన చేతులున్నాయేమోగానీ, నిజ జీవితంలో మాత్రం కాస్తంత బలహీనమయ్యాయి. కండలు తిరిగిన చేతులున్న ప్రభాస్ ఒక భుజానికి ఆమధ్య ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే గాయమైంది. ఆ విషయం అప్పట్లో మీడియాకి లీక్ అయినప్పటికీ యూనిట్ దాన్ని కొట్టిపారేశారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ తన భుజానికి శస్త్రచికిత్స చెప్పాడు. దాని ప్రకారం ప్రభాస్‌కు బాహుబలి షూటింగ్‌లో భుజానికి గాయలయ్యాయట. అయితే ఆ సమయంలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోక పోవడంతో గాయాలు తిరగ బెట్టాయట ఇక లాభం లేదని ప్రభాస్ వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడు. నిజానికి ఈ ఆపరేషన్ చాలా రోజుల క్రితం జరగాల్సింది. కానీ నేనే ఆలస్యం చేస్తూ వచ్చాను. ప్రస్తుతం అంతా బాగానే వుంది. మరో నెల రోజుల్లో 'బాహుబలి' షూటింగ్‌లో పాల్గొంటాను. నా ఆరోగ్య విషయంలో ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రభాస్ తెలిపాడు.


.jpg)
.jpg)


